రేపు జిల్లాకు వర్ష సూచన
VZM: రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రంలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో సోమ, మంగళవారం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు.