భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

WNP: భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెబ్బేరు ఎస్సై యుగంధర్ రెడ్డి కోరారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, చెరువులు, కుంటలు చూడటానికి వెళ్లకూడదని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించకూడదని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్లను తాకవద్దని ఆయన హెచ్చరించారు. రైతులు పొలాలలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు.