'బెల్ట్ షాపులు వద్దు అంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన'

'బెల్ట్ షాపులు వద్దు అంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన'

అన్నమయ్య: మదనపల్లె మండలం యనమలవారిపల్లెలో అక్రమ మద్యం బెల్ట్ షాపుల ద్వారా విక్రయించకుండా అరికట్టాలని సోమవారం సబ్ కలెక్టర్ ఎదుట మహిళలు నిరసన తెలిపారు. గ్రామానికి చెందిన బీబీ ఆధ్వర్యంలో పలువురు మహిళలు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కొంతకాలంగా ఎనములవారిపల్లెలో భాస్కర్, రమాదేవి, తదితరులు విచ్చలవిడిగా అక్రమ మద్యం విక్రయిస్తున్నట్లు తెలిపారు.