నేడు అసోంలో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ ఇవాళ అసోంలో పర్యటించనున్నారు. మోదీ పర్యటనలో భాగంగా రూ.19 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని మూడు రోజులపాటు ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నిన్న మిజోరాం, మణిపూర్‌లో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇవాళ అసోంలో పర్యటించనున్నారు. మోదీ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.