VIDEO: ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన
GNTR: ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామానికి చెందిన కె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో యూఎస్ఏ నుంచి వచ్చిన 20 మంది వైద్యులు, చిన్నావుటపల్లి నుంచి వచ్చిన సిద్ధార్థ దంత వైద్య కళాశాల వైద్యులు పాల్గొన్నారు. శిబిరానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు కంటి, దంత, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.