బాపట్లలో వరదలపై హై అలెర్ట్

BPT: భారీ వర్షాలు, వరదల హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ వెంకట మురళి బుధవారం హై అలెర్ట్ ప్రకటించారు. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. గర్భిణులు, వృద్ధులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. రైతులు పొలాలకు, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. సమస్యలు తలెత్తితే కంట్రోల్ రూమ్ నెంబర్ 1077ను సంప్రదించాలన్నారు.