సీసీ కెమెరాలకు లక్ష రూపాయలు విరాళం

RR: ఆమనగల్లు మండలం శెట్టిపల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు బొచ్చుపల్లి రాకేశ్ రావు రూ.1 లక్ష విరాళంగా ఇచ్చారు. శుక్రవారం ఆయన ఈ మొత్తాన్ని ఎస్సై వెంకటేశ్‌కు అందించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఎస్సై తెలిపారు. రాకేశ్ రావు సామాజిక సేవను ఎస్సై అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు.