ఎమ్మెల్యే గిడ్డి సమక్షంలో జనసేనలో చేరికలు
కోనసీమ: పీ.గన్నవరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం మామిడికుదురు, అంబాజీపేట మండలాలకు చెందిన వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో జనసేనలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలు, మహానుభావుల స్ఫూర్తితో ఏర్పడిన రాజకీయ పార్టీ జనసేన పార్టీ అని పేర్కొన్నారు.