వైసీపీ అఖండ మెజార్టీ సాధించాలి: మేకపాటి రాజగోపాల్ రెడ్డి

నెల్లూరు: దుత్తలూరు మండల పరిధిలోని వెంకటంపేటలో వెలసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయగిరి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు తీసుకొని ప్రచార యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయగిరి ప్రజలు క్షేమంగా ఉండాలని త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీ సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు.