APSRTC: గూగుల్ మ్యాప్స్ ద్వారా టికెట్ బుకింగ్
APSRTC తన ప్రయాణికుల కోసం టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని మరింత సులభతరం చేసింది. తాజాగా గూగుల్ మ్యాప్స్, వాట్సాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. గూగుల్ మ్యాప్స్‌లో రూట్ సెర్చ్ చేసిన వెంటనే ఆ మార్గంలో ప్రయాణించే బస్సులు, అందుబాటులో ఉన్న సీట్లు కనబడతాయి. దీంతో ప్రయాణికులు తమకు అవసరమైన బస్సుకు టికెట్లను రిజర్వ్ చేసుకోవచ్చు.