వెంగంవారి పల్లెలో రైతన్న 'మీకోసం' కార్యక్రమం
CTR: బైరెడ్డిపల్లి మండలంలోని వెంగంవారి పల్లె పంచాయతీ కేంద్రంలో గురువారం రైతన్న 'మీకోసం' కార్యక్రమంలో పలమనేరు శాసనసభ్యులు అమర్‌నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. అదే విధంగా అన్నదాత సుఖీభవ సొమ్ము రైతులకు చేరిందా అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకున్నారు.