ఎస్సీ, ఎస్టీలపై దాడులు ఆపాలి: జకరయ్య

ఎస్సీ, ఎస్టీలపై దాడులు ఆపాలి: జకరయ్య

కడప జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. బ్రహ్మంగారిమఠం, నందలూరు, దువ్వూరు, బద్వేల్లో జరిగిన ఘటనల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కార్యదర్శి బండి జకరయ్య విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.