తాడేపల్లిలో గంజాయి సేవిస్తున్న 9 మంది అరెస్ట్
GNTR: తాడేపల్లి పరిధి ప్రాతూరులో గంజాయి సేవిస్తున్న 9 మందిని అరెస్టు చేసినట్లు గురువారం సీఐ వీరేంద్ర బాబు తెలిపారు. కరకట్ట వద్ద గంజాయి తాగుతున్నట్లు అందిన సమాచారంతో ఎస్సై ప్రతాప్ సిబ్బందితో కలిసి దాడిచేసి, వారి వద్ద నుంచి 810 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మండల పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.