VIDEO: ఇంధన కష్టాలు.. గంటల తరబడి క్యూలైన్లో
కోనసీమ: కొత్తపేట మండలంలో గ్యాస్,పెట్రోల్ కొరతతో వినియోగదారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సరఫరా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.