VIDEO: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రజాసంఘాలు ఆందోళన

నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సాయికుమార్ (26) మృతి చెందడంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణం సంభవించిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆందోళనకారుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె ఖండించారు.