మంచిమాట: ఆత్మ విశ్వాసం పెరగాలంటే..?

మంచిమాట: ఆత్మ విశ్వాసం పెరగాలంటే..?

ఇతర నైపుణ్యాల మాదిరిగానే సాధన ద్వారా ఆత్మా విశ్వాసాన్ని సొంతం చేసుకోవచ్చు. ముందుగా మీరు సాధించగలిగే చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోండి. ఆ లక్ష్యాలను విజయవంతంగా అందుకున్న ప్రతిసారీ మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. ఈ చిన్న విజయాలు పెద్ద లక్ష్యాలపై గురి పెట్టడానికి మీకు గొప్ప ప్రేరణగా, బలమైన పునాదిగా నిలుస్తాయి. తద్వారా మీ ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా మెరుగుపరచుకోవచ్చు.