కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే
BDK: మణుగూరు మండలం విప్పల సింగారం గ్రామంలో స్థానిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ప్రజలను పలకరించారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, కాంగ్రెస్ ప్రభుత్వ పరివర్తన శక్తిని ప్రజలకు వివరించారు. నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.