2021 సీన్ మళ్లీ రిపీట్ అవుతుందా?
అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ సీఎం మమతకు బీజేపీ షాక్ ఇచ్చింది. నందిగ్రామ్ నియోజకవర్గ MLA అభ్యర్థిగా మరోసారి సువేందు అధికారిని ప్రకటించింది. 2021 ఎన్నికల్లో మమతకు వ్యతిరేకంగా పోటీ చేసిన సువేందు అందరినీ ఆశ్చర్యపరుస్తూ దీదీపై విజయం సాధించారు. దీంతో షాక్‌కు గురైన మమత మరో స్థానం నుంచి ఉపఎన్నికల్లో గెలిచారు. మళ్లీ సువేందు అదే స్థానం నుంచి పోటీ చేయటం సర్వత్రా ఆసక్తి నెలకొంది.