వర్షాల్లో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి: ఏసీపీ
SDPT: భారీ వర్షాల నేపథ్యంలో వాహనదారులు రోడ్లపై జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని, వేగాన్ని నియంత్రించుకోవాలని సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సూచించారు. వర్షం కారణంగా పట్టణంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, లోతట్టు ప్రాంతాలను ఆయన స్వయంగా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.