'రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం'
E.G: అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలo గొల్లల మామిడాడలోని శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర సహకార పరపతి సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం ప్రారంభించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.