దేగాం గ్రామంలో రేషన్ కార్డులు సర్వే షురూ

దేగాం గ్రామంలో రేషన్ కార్డులు సర్వే షురూ

NZB: ఈనెల 26వ తేదీ నుంచి కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆలూర్ మండలం దేగాం గ్రామంలో గురువారం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ..ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్వే, క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.