రేపు ఖమ్మంలో జాబ్ మేళా

KMM: ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యాన మంగళవారం ఉదయం 10గంటలకు ఖమ్మం ప్రభుత్వ ఐటీఐ సెంటర్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారిణి ఎన్.మాధవి తెలిపారు. అపొలో హోమియో కేర్‌లో 34 పోస్టులకు ఇంటర్‌వ్యూలు ఉంటాయని, హాజరయ్యే వారికి 18 -30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలన్నారు. నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, బీటెక్ బయోమెడికల్ సబ్జెక్టులో ఉత్తీర్ణులై ఉండాలని వివరించారు.