ఈనెల 4 న అనకాపల్లి జిల్లాలో బాలకృష్ణ పర్యటన

విశాఖ: 4వ తేదీన అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి, మాడుగులలో నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. 4వ తేది శనివారం సాయంత్రం 4.30 గంటలకు యలయంచిలిలో కూటమి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, సాయంత్రం 7గంటలకు మాడుగులలో కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తిలకు మద్దతుగా బాలకృష్ణ ప్రచారం చేస్తారు.