VIDEO: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

JN: దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన హమాలీ చిట్టబోయిన వీరయ్య మూడు రోజుల క్రితం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మంగళవారం మృతుడి ఇంటికి వెళ్లి వీరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.