ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ తహసీల్దార్
MHBD: పెద్దవంగర మండల కేంద్రంలో తహసీల్దార్ మహేందర్ రూ.25,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మండలంలోని ఓ రైతు నుంచి లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఏసీబీ బృందం ఆకస్మిక దాడితో MRO దొరికిపోయాడు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.