ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్స్ సస్పెండ్

MDK: మెదక్ పట్టణంలోని వెంకటరమణ కాలనీలో బుధవారం పేకాట ఆడుతూ పట్టుబడిన ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్‌లను సస్పెన్షన్ చేసినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. వెంకటరమణ కాలనీలో పేకాట ఆడుతూ ఏఆర్ కానిస్టేబుళ్లు ఆంజనేయులు, సురేష్ పట్టుబడినట్లు వివరించారు. శాఖపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.