రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
VZM: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వరి పంటకు నష్టం జరగకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం సూచించారు. వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశముందని, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులను అప్రమత్తం చేయాలన్నారు. గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మానిటరింగ్ చేయాలని ఆదేశించారు.