విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
కృష్ణ: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై పామర్రు (M) కురుమద్దాలి ఫ్లైఓవర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు కల్వర్టును ఢీకొనడంతో పూర్తిగా ధ్వంసమై, ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్ గల ఆ కారులో ఇరుక్కున్న మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. అనంతరం నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరించారు.