ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు!

ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడు!

అల్బేనియా-గ్రీస్ సరిహద్దులోని ఒక గుహలో ప్రపంచంలోనే అతిపెద్ద సాలీడు గూడును పరిశోధకులు కనుగొన్నారు. ఈ గూడు 106 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇది రెండు జాతుల సాలీళ్లకు నిలయమని, దాదాపు 1,11,000 సాలీళ్లు కలిసి ఈ ఉమ్మడి గూడును నిర్మించినట్లు వెల్లడించారు. ఇంత పెద్ద స్థాయిలో సాలీళ్లు ఒకేచోట గూడు కట్టడం అరుదైన దృశ్యమని వారు అభివర్ణించారు.