'బీఆర్ఎస్ పదేళ్లలో చేరినది మేము 18 నెలల్లో చేసి చూపించాం'

MBNR: బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని తాము 18 నెలల్లోనే చేసి చూపించామని దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూత్పూర్ మండలం లంబడి కుంట తండాలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా 4.5 కోట్ల రూపాయలతో మంజూరైన బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు లిక్కి నవీన్ పాల్గొన్నారు.