'విశ్వనాధపురం రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తి చేయాలి'

'విశ్వనాధపురం రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తి చేయాలి'

కడప: నగరంలోని విశ్వనాధపురం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పెండింగ్‌లో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం పార్టీ నేతలు, ప్రజలతో కలిసి బ్రిడ్జి పనులను పరిశీలించిన ఆయన, తక్షణమే నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.