గడ్డూరు యువకుడి అనుమానాస్పద మృతి

CTR: పెద్దపంజాణి మండలం గడ్డూరుకి చెందిన కృష్ణప్ప కుమారుడు కుమార్ బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో భాగంగా వ్యక్తిగత సమస్యల కారణంగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా మరే ఇతర కారణాలున్నాయా అనేది పోస్టుమార్టం నివేదిక అనంతరం తెలుస్తుందన్నారు.