VIDEO: పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

VIDEO: పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

హన్మకొండ నగరంలోని గోపాలాపురం చింతల రాజు ఇంట్లో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 1,86,020 నగదు, 9 మొబైళ్లు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఎసీపీ మధుసూదన్ తెలిపారు.