ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు గడువు పెంపు

కరీంనగర్: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మొదటి సంవత్సరంలో BA, B.COM, BSc కోర్సుల్లో ప్రవేశాలకు గడువును SEP 26 వరకు పొడిగించినట్లు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి. రమేష్ తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించాలని కోరారు.