జిల్లా ఎస్పీని కలిసిన సీఐ
SKLM: పలాస - కాశిబుగ్గ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా రామకృష్ణ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన పరిధిలో ఉన్న సర్కిల్లో శాంతిభద్రతకు విఘాతం కలగకుండా చూస్తానని పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ సూచించినట్లు ఆయన అన్నారు.