సూక్ష్మ సేద్యం పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLG: దేవరకొండలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర ఉద్యాన వన పట్టు పరిశ్రమల శాఖ వారు ఏర్పాటు చేసిన సూక్ష్మ సేద్యం పరికరాలు (స్ప్రిం క్లర్స్) పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే బాలునాయక్ లబ్ధిదారులకు పరికరాలు పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.