పట్టణంలో సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీ
NLG: హాలియా పట్టణంలో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టీ సెంటర్లలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వాడుతున్న వ్యాపారులపై అక్రమ వినియోగం 6-ఏ కింద కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 18 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడితే గ్యాస్ ఏజెన్సీలపై కూడా చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.