పిల్లలు లేరని వేధింపులు.. మహిళ ఆత్మహత్య

పిల్లలు లేరని వేధింపులు.. మహిళ ఆత్మహత్య

కృష్ణా: కృత్తివెన్ను(M) మాట్లంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న స్వాతి (23), పల్లెపాలెంకు చెందిన కుమారస్వామితో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. సంతానం లేకపోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు, అత్తింటివారి వేధింపులతో మంగళవారం స్వాతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై బుధవారం కృత్తివెన్ను పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.