నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
GNTR: నగరంలోని డీ-1 సెక్షన్ పరిధిలో విద్యుల్ లైన్, చెట్ల కొమ్మల తొలగింపు, నూతన స్తంభాల ఏర్పాటు కారణంగా ఇవాళ ఉ. 8.30 గంటల నుంచి మ. 1.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈఈ ముస్తక్ అహ్మద్ తెలిపారు. అరండల్ పేటలోనా 1వ లైన్ నుంచి 6వ లైన్ వరకు, బ్రాడిపేట 1వ లైన్ నుంచి 4వ లైన్ వరకు విద్యుత్‌కు అంతరాయం ఉంటుందన్నారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.