పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు ప్రారంభం

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు ప్రారంభం

కృష్ణా: పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. డిప్యూటీ కలెక్టర్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె రమేష్ నాయుడు గణపతి పూజ నిర్వహించి, అమ్మవారి అంతరాలయంలో అఖండ జ్యోతి స్థాపన చేసి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవాలను 5 రోజులు పాటు నిర్వహిస్తారు.