గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

GNTR: మంగళగిరి మండలం నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్శిటీ ఏ.పి.జె. అబ్దుల్ కలాం ఆడిటోరియంలో ఈ నెల 18న జరిగే గ్రీన్ హైడ్రోజన్ – 2025 సమ్మిట్‌కు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను గురువారం కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ, ఎస్పీ సతీశ్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలసి పరిశీలించారు.