అఖిలపక్ష పార్టీల నేతలతో సీఐ సమావేశం

అఖిలపక్ష పార్టీల నేతలతో సీఐ సమావేశం

ఖమ్మం 1-టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం అఖిలపక్ష పార్టీల నేతలతో సీఐ కరుణాకర్ వినాయక చవితి ఉత్సవాలపై సమావేశం నిర్వహించారు. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరిగే విధంగా సహకరించాలని సూచించారు. పోలీస్ శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. అటు గణేష్ మండపాల వద్ద డీజీలకు అనుమతి లేదని, కమిటీ సభ్యులు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.