సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన

సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ మోడల్ స్కూల్లో రూరల్ ఎస్సై రాజేష్ విద్యార్థులకు సైబర్ మోసాలు, పోక్సో చట్టంపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాలు బారిన పడకుండా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విద్యార్థులందరూ కష్టపడి చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.