గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు

KMRD: ఎల్లారెడ్డిలోని తెలంగాణ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ మహమ్మద్ తెలిపారు. 5వ తరగతిలో 40 సీట్లతో పాటు 6,7,8,9 తరగతుల్లో పరిమిత సంఖ్యలో బ్యాక్ లాగ్ మైనారిటీ కేటగిరి సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. 2024-25 సంవత్సరంలో 4వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు 5వ తరగతి అర్హులని అన్నారు.