రూ. 2 లక్షల డిమాండ్.. ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన

రూ. 2 లక్షల డిమాండ్.. ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన

HNK: చెన్నారావుపేట (M) చెందిన మహేష్ నిన్న గడ్డి మందు తాగి హన్మకొండ హంటర్ రోడ్‌లోని మేడికవర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. అయితే చికిత్స పొందుతూ మహేష్ ఇవాళ మృతి చెందగా, ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయకుండానే ఆసుపత్రి యాజమాన్యం రూ.2 లక్షలు వసూలు చేసినట్లు బంధువులు తెలిపారు. ఈ విషయంపై అధికారులు స్పందించి ఆసుపత్రి యాజమన్యంపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు.