గాలివానకు విరిగిపడిన చెట్టు
NRPT: మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట స్టేజి సమీపంలో మంగళవారం భారీ వర్షానికి చెట్టు విరిగి అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై పడింది. వెంటనే ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మరికల్ ఎస్సై 2 మహేశ్వరి ఆధ్వర్యంలో చెట్టును తొలగించి రాకపోకలను కొనసాగించారు. ఏఎస్ఐ మసద్‌తో పాటు పోలీసులు పాల్గొన్నారు.