రహదారులపై రాకపోకలకు తొలగిన అడ్డంకి

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రహదారులపై, విద్యుత్ తీగలపై పడిన చెట్లు కొమ్మలను శుక్రవారం సాయంత్రానికి తొలగించి వాహనదారుల రాకపోకలకు అంతరాయం లేకుండా చేసినట్లు ఆమదాలవలస మున్సిపల్ సిబ్బంది తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టామని అన్నారు. పలువురు స్థానికులు వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు