ఆందోళన నిర్వహించిన బీజేపీ నాయకులు
MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని BJP లక్షెట్టిపేట మండల, పట్టణ నాయకులు ఆందోళన నిర్వహించారు. సోమవారం వారు లక్షెట్టిపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్ దిలీప్‌కు వినతి పత్రం సమర్పించారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలన్నారు.