విజయవాడలో గ్రూప్-2 విద్యార్థుల నిరసన

కృష్ణా: విజయవాడ లబ్బీపేటలో గ్రూప్-2 అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ఓటు వేయించుకొని గెలిచిన తరువాత నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని ఆందోళన చేశారు. గ్రూప్-2 నోటిఫికేషన్ తక్షణమే నిర్వహించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని అభ్యర్థులు హెచ్చరించారు.