వ్యక్తిని సజీవ దహనం చేయడానికి ప్రయత్నం
RR: వ్యక్తిని సజీవ దహనం చేయడానికి ప్రయత్నించిన ఘటన షాద్‌నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాలు.. తిరుమల కాలనీకి చెందిన శీను అనే వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి శీనుపై పెట్రోల్ చల్లాడు. శీను కేకలు వేయడంతో స్థానికులు రావడంతో గుర్తు తెలియని వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.